Homeఆంధ్రప్రదేశ్వాట్సాప్ గవర్నెన్స్ పై కనకరాజు

వాట్సాప్ గవర్నెన్స్ పై కనకరాజు

- Advertisement -

వాట్సాప్ గవర్నెన్స్(మన మిత్ర యాప్)పై అవగాహన కల్పించండి
విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటి : డిజిటల్ సేవలలో భాగంగా అందుబాటులో ఉన్న వాట్సాప్ గవర్నెన్స్ (మనమిత్ర యాప్) పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని మెప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరక్టర్ టి.కనకరాజు సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం మన మిత్ర వాట్సాప్ సేవలపై మెప్మా సిబ్బందికి, ఆర్పీలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ , దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకురావడం జరిగిందని, దీనిలో భాగంగా 26 శాఖలకు చెందిన 530 కు పైగా సేవలు ప్రతి పౌరునికి అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఇందుకోసం ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో 9552300009 నెంబర్ కు మెసేజ్‌ చేస్తే సరిపోతుందన్నారు. కానీ వాట్సాప్‌ గవర్నెన్స్‌ పై పూర్తి అవగాహన లేకపోవడంతో ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని కనకరాజు అన్నారు. ఈ నేపథ్యంలో మన మిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ పై విస్తృత ప్రచారం చేయవలసిన అవసరం ఉందన్నారు. దీని ద్వారా ప్రజలు కార్యాలయాలకు వెళ్లకుండా నేరుగా వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా ఇంటి వద్ద నుంచే సేవలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే పురపాలక సేవలను ఇంటి వద్ద నుండే ఫోన్ ద్వారా పొందడానికి వీలుగా రూపొందించిన పురమిత్ర యాప్ ని నగర ప్రజలు సద్వినియోగపరచుకునేలా అవగాహన కలిగించాలని,  దీని ద్వారా సుమారు 122 రకాల పురపాలక సేవలను చేతిలోని ఫోన్ ద్వారానే పొందవచ్చన్నారు. కార్యక్రమంలో సీఎంఎం రామలక్ష్మి, టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ ఎం.ఫణి కుమార్, శ్రీదేవి, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.  

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు