Homeఆంధ్రప్రదేశ్తుపాన్ తీవ్రత దృష్ట్యా ఎమ్మెల్యే బత్తుల

తుపాన్ తీవ్రత దృష్ట్యా ఎమ్మెల్యే బత్తుల

- Advertisement -

తుపాన్ తీవ్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి 

ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ 

– 132 ఎకరాల్లో నేలకొరిగిన వరి పంట 

– మూడు మండలాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు 

విశాలాంధ్ర – సీతానగరం:  తుపాన్ తీవ్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మండలంలో పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. దీనిలో భాగంగా ముగ్గుళ్ళ గ్రామంలో ముంపు ప్రాంతం, పునరావాస కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం రఘుదేవపురం గ్రామంలో నేలకొరిగిన వరి పంట పొలంను పరిశీలించారు. అలాగే రెవెన్యూ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి ముందస్తు చర్యలు తీసుకోని అన్ని మండలాల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. అలగే వీటిని మండల ప్రత్యేక అధికారలు ఎప్పటికీ అప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు అని అన్నారు. మండలంలో చీపురుపల్లి వంగూరి నాగమనికి చెందిన తాటాకు ఇల్లు పడిపోయింది, సింగవరం గోడ కూలింది ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ హాని జరగలేదు అని అన్నారు. మండల వ్యాప్తంగా 132 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది అని అన్నారు. ఈ రైతులకు పంట నష్టం వచ్చేలా ప్రయత్నం చేస్తాను అని అన్నారు. సీతానగరం సర్పంచ్ కొండ్రపు ముత్యాలు కుమ్మరి గొయ్యి నిండి సుమారు వంద కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు అని చెరువుకు ఔట్ లెట్ ఏర్పాటు చేసి ప్రజలను కాపాడాలని కోరారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి అధికారుల వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ తుపాన్ ముగియగానే దీనికి ఇంజనీరింగ్ అధికారుల సమక్షంలో శాశ్వత పరిష్కారం చూపిస్తా అని హామీ ఇచ్చారు. అలాగే తుపాన్ పై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే కూటమి పార్టీ నాయకులు కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాంప్రసాద్, తహసిల్దార్ ఏ శ్రీనివాస్, ఎంపిడిఓ ఎమ్ భారతి, అర్ ఐ నవీన్, డి టి సునీత, సి ఐ సత్య కిషోర్, ఎస్ ఐ రామ్ కుమార్, అర్ ఎన్ బి ఏ ఈ వీరన్న బాబు, పంచాయితీ ఏ ఈ జోయెల్, హౌసింగ్ ఏ ఈ సుబ్రమణ్యం, అర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ ప్రకాష్, వైద్య అధికారి డాక్టర్ చైతన్య, అగ్రికల్చరల్ ఏ ఈ గౌరీ దేవి, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు