Homeఆంధ్రప్రదేశ్నూతన ఉపాధ్యాయులను సత్కరించిన పోతవరం సర్పంచ్

నూతన ఉపాధ్యాయులను సత్కరించిన పోతవరం సర్పంచ్

- Advertisement -

విశాలాంధ్ర – నల్లజర్ల : నేను చదువుకోలేకపోయినా చదువుకు ఉన్న విలువ ఎంత గొప్పదో మీద్వారా తెలుసుకున్నానని నల్లజర్ల మండలం పోతవరం గ్రామ సర్పంచ్ నూతికుర్తి లక్ష్మణ్ రావు అన్నారు. జాలపర్తి జయశేఖర్ అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన పెన్నాడ శ్రీనివాస రావు. కొడమంచిలి శ్రీధర్. గడ్డం ప్రేమ్ కుమార్. దొండపాటి హర్ష ప్రియ.లకు పోతవరం గ్రామ సర్పంచ్ నూతికుర్తి లక్ష్మణరావు, వారి సోదరుడు రామకృష్ణ ఆధ్వర్యంలో  దుస్సాలువాలు కప్పి, పూలదండలు వేసి, కేక్ కట్ చేసి 

సత్కారం చేశారు. అనంతరం ఈ కార్యక్రమం లో గత కొన్ని సంవత్సరాలుగా విద్యనందిస్తూ గ్రామంలో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు  మిర్యాల రాంబాబు. విజయ్ శ్రీనివాస్. వెంకటేష్ లను సత్కరించారు.ముఖ్య అతిథులుగా కంకిపాడు రవికుమార్ పాస్టర్ తానింకి ప్రవీణ్ కుమార్, విద్య యొక్క గొప్పతనాన్నివివరించారు. కార్యక్రమంలో చిడిపి  చింతయ్య, సుధీర్, కలిదిండి శ్రీను,వెంకటరావు, దొండపాటి రాజు, ఉండ్రాజవరపు రాజు. కంకట నాగేశ్వరావు, పెన్నాడ వెంకటరత్నం, వీరగడ్ల బ్రహ్మయ్య, ఉందుర్తి రాజేష్ రామకృష్ణ, ఎమ్మార్పీఎస్ పెద్దలు, ప్రముఖులు, కొత్తపేట యూత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు