Homeఆంధ్రప్రదేశ్కిక్‌బాక్సింగ్‌ లో ఎస్‌.కె.ఆర్‌

కిక్‌బాక్సింగ్‌ లో ఎస్‌.కె.ఆర్‌

- Advertisement -

ఖేలో ఇండియా కిక్‌బాక్సింగ్‌ పోటీల్లో  
ఎస్‌.కె.ఆర్‌. మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు మొద‌టి స్థానం
జాతీయ స్థాయికి ఎంపిక

విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటి : ఇటీవ‌ల తూర్పు,  ప‌శ్చిమ గోదావరి జిల్లాల‌ స్థాయిలో  బొమ్మూరు డిఫెన్స్‌ అకాడమీలో నిర్వహించిన ఖేలో ఇండియా కిక్‌బాక్సింగ్‌ పోటీలలో ఎస్‌.కె.ఆర్‌. గవర్నమెంట్ మ‌హిళా డిగ్రీ కళాశాల  విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు.  మొత్తం 160 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలలో, ఎస్‌.కె.ఆర్‌. కళాశాల విద్యార్థినులు  8 గోల్డ్‌ మెడల్స్‌, 5 సిల్వర్‌ మెడల్స్ సాధించి మొదటి స్థానంలో నిలిచారు. అలాగే . గోల్డ్‌ మెడల్స్  గెలుచుకున్న విద్యార్థినులు  దక్షిణ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.   ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్  డా. పి. రాఘవ కుమారి, శారీరక విద్యా విభాగాధ్యక్షురాలు వై. సుధారాణి, ఏ. నాగు,  కిక్‌బాక్సింగ్‌ కోచ్  భవాని శంకర్‌.  అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సభ్యురాలు డా. కె. నీరజ‌లు    విద్యార్థినుల ప్రతిభను ప్రశంసించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు