- Advertisement -
కడియంలో వరి చేలు పరిశీలించిన మండల వ్యవసాయాధికారి.
విశాలాంధ్ర – కడియం : కడియం మండలం లోని వరి పంట పొలాలు ఇప్పటివరకూ నీట మునిగిన సందర్భాలు లేవని మండల వ్యవసాయ అధికారి పీవీ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం స్థానిక రైతులలో కలిసి వరి చేలు పరిశీలించామన్నారు. మండల వ్యాప్తంగా 2014 హెక్టార్లలో వరి సాగు చేస్తున్నట్లు, 163 హెక్టార్లలో వరి నేల కొరిగినట్లు తెలిపారు. రైతులకు క్షేత్ర స్థాయి సిబ్బంది అందుబాటులో ఉన్నారని, అలాగే తాము కూడా ఎప్పటి కప్పుడు వరి పంటకు సంబందించి రైతులకు సూచనలు అందజేస్తున్నామని తెలిపారు.


