Homeఆంధ్రప్రదేశ్ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మద్దిపాటి

ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మద్దిపాటి

- Advertisement -

విశాలాంధ్ర – దేవరపల్లి : తుఫాను సహాయ చర్యలు తీసుకోవడంలో అధికారులు ప్రజాప్రతినిధులు ముందస్తు చర్యలు తీసుకోవాలని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు దేవరపల్లి తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ నుండి వచ్చే ఆదేశాలను అధికారులు ప్రజాప్రతినిధులు చేపట్టాలని అన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు తో కూడా తాను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నానని ఆయన చేసే సూచనలు సలహాలు పాటిస్తున్నట్లు తెలిపారు గోపాలపురం నియోజకవర్గంలో నిర్వాసితులకు ప్రతి మండలం హెడ్ క్వార్టర్లతోపాటు ప్రధాన గ్రామాలలో పునరావసకేంథాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు నియోజకవర్గంలో పదివేల ఆహార పొట్లాలు తయారు చేస్తున్నావని అన్నారు ప్రతి మండలానికి2 నుండి 3వేల పొట్లాలు సిద్ధంగా ఉంచామని ఆయన తెలిపారు ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు చిన్న పిల్లలు బాలింతలు లకు అవకాశం కల్పించి వారికి నచ్చచెప్పి పునరావస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు పునరావస్తు కేంద్రాలలో విద్యుత్తు త్రాగునీరు జనరేటర్లు మందుల కిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారులు అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలతో మేమేక అవ్వాలని ఆయన అన్నారు అధికారులు కూడా స్థానిక ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి సహాయ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మద్దిపాటి సూచించారు దేవరపల్లి మండలంలో తుఫాను సహాయ చర్లపై గంట గంటకు తనకు నివేదిక పంపాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఎం శ్రీనివాస్ ఎంపీడీవో సిహెచ్ నాగార్జున రావు ట్రాన్స్కో చేయి చిలకా వెంకట్రావు ఆర్డబ్ల్యుఎఫ్ కుమారి వైద్యాధికారి సంజీవ కుమార్ మండల స్థాయి అధికారులు గోపాలపురం విఎంసి చైర్మన్ యద్దనపూడి బ్రహ్మ రాజు దేవరపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆండ్రు అనిల్ తెలుగుదేశం నేతలు కొయ్యల మూడు చిన్నబాబు ఉప్పులూరి రామారావు సుంకర దుర్గారావు ముళ్ళపూడి దొరాజి చౌదరి బల్ల సూర్యచక్రం ముళ్ళపూడి దొరజి చౌదరి తాతారావు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు