Homeజిల్లాలుఅనంతపురంఅంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

- Advertisement -

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ.బీ.దేవి

విశాలాంధ్ర- అనంతపురం : అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ.బీ.దేవి పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జిల్లాలో పనిచేయుచున్నటువంటి ప్రాథమిక మరియు పట్టణ వైద్యాధికారులకు మరియు సిబ్బందికి మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ముఖ్యంగా వైద్యాధికారి మరియు వైద్య సిబ్బంది ప్రజలకు ప్రత్యేకమైన శ్రద్ధతో ఆరోగ్య సేవలు అందించాలని ప్రస్తుతం తుపాన్ ఉన్నందున అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉందని అంటువ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు చేపట్టాలని, మంచినీటి ట్యాంకులు క్లోరినేషన్ చేయించి ప్రజలకు ఆరోగ్యకరమైన త్రాగునీటిని అందించాలని తెలియజేశారు, వైద్యాధికారులు మరియు సిబ్బంది తప్పక తమ తమ విధులలో పనివేళలకు హాజరుకావాలని ఆదేశించడం జరిగింది. ప్రజలలో వైద్య సేవల పట్ల నూటికి నూరు శాతం సంతృప్తి స్థాయిలో ఉండే విధంగా వైద్యాధికారులు మరియు సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు, ప్రాథమిక వైద్య కేంద్రాలు వెనుకబడి ఉన్నాయని దీనిపై వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నూటికి నూరు శాతం సంతృప్తి స్థాయిలో ఉండే విధంగా వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. ప్రత్యేకంగా ప్రతి వైద్యాధికారి తమ కేంద్రమునకు ప్రాథమిక, పట్టణ కేంద్రాలకు వచ్చిన రోగులకు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ నమోదు చేయాలని పేర్కొన్నారు.
ఎవరైనా వైద్యాధికారులు గాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాప్ గాని విధులలో లేనియెడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధులకు సరిగా హాజరు కాని వైద్యాధికారులకు తిమ్మంపల్లి, నాగసముద్రం, బొమ్మనహల్ వైద్యాధికారులకు మెమో లు జారీ చేశారు.
ఈ జూమ్ కార్యక్రమంలో డి ఎల్ టి వో జయలక్ష్మి, ప్రోగ్రాం ఆఫీసర్స్ , డాక్టర్ జి నారాయణస్వామి, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, కే సురేందర్ రెడ్డి డి.ఎస్.ఓ, ఎస్ ఓ మహమ్మద్ రఫీ, డెమో నాగరాజు, సి సుబ్రహ్మణ్యం, డిప్యూటీ హెచ్ఈఓ, ఎపేడెమిక్ సెల్ బలరాం రెడ్డి, సి, వెంకటేష్, డిప్యూటీహెచ్ ఈవో,ఎన్ హెచ్ ఎం జరీనా, పాల్గొన్నారు,

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు