విశాలాంధ్ర ధర్మవరం; రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, ఎలాక్యూషన్ , క్విజ్ పోటీలలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం లోని సంజయ్ నగర్ లో గల బిఎస్ఆర్ బి ఎస్ ఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పి. జస్వంత్ విజయం సాధించి, రాష్ట్ర అసెంబ్లీకి ఎంపిక కావడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ మేరీ వర కుమారి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నవంబర్ 26వ తేదీ అమరావతిలో జరిగే విద్యార్థి అసెంబ్లీలో పాల్గొంటారని ధర్మవరం మండల విద్యాధికారులు శ్రీమతి రాజేశ్వరి దేవి, శ్రీ గోపాల్ నాయక్ తెలియజేశారు. నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి,ముదిగుబ్బ మండల పాఠశాలల నుంచి ఈ పోటీల్లో విద్యార్థులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ పోటీల్లో విజయం సాధించిన టీ. జస్వంత్ ను మండల విద్యాధికారులు తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేరీ వర కుమారి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎస్. రవీందర్ రెడ్డి, ప్రేమసాగర్, సుదర్శన, విజయలక్ష్మి ఇతరు ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, సభ్యులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జస్వంత్ మాట్లాడుతూ మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఈ రవీందర్ రెడ్డి సలహాలతో నేను ఈ విజయం సాధించని తెలియజేశాడు. అసెంబ్లీలో ధర్మవరంలో విద్యాభివృద్ధి, చేనేత సమస్యల గురించి ప్రస్తావిస్తానని తెలియజేశాడు.
రాష్ట్ర అసెంబ్లీకి బిఎస్ఆర్ విద్యార్థి ఎంపిక
- Advertisement -
RELATED ARTICLES


