Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎమ్మెల్సీ పాయింట్, ఎఫ్.పి షాపుల తనిఖీ

ఎమ్మెల్సీ పాయింట్, ఎఫ్.పి షాపుల తనిఖీ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని ఎమ్మెల్సీ పాయింటును పట్టణంలోని ఎఫ్.పి షాపులను ఆకస్మికంగా ఆర్డిఓ మహేష్ తనిఖీ చేశారు. ఇతనికెలో భాగంగా ఆర్డిఓ తో పాటు
తహసీల్దార్ సురేష్ బాబు, సి.ఎస్.డి.టి., గ్రామ రెవెన్యూ అధికారులు తో కలిసి ప్రజా పంపిణీ వ్యవస్థ సమర్థవంతమైన అమలును నిర్ధారించుటకు తనిఖీ చేశారు. తనిఖీలు భాగంగా ఆర్డివో
స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ రికార్డులు, తూకం యంత్రాలు, అత్యవసర సరుకుల నాణ్యతను సమీక్షించారు. అదేవిధంగా లబ్ధిదారుల ఆధార్ ధృవీకరణ రికార్డులు ,సంతక అంగీకార పత్రాలు కూడా పరిశీలించి, పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను నిర్ధారించారు.ఆర్డిఓ డీలర్లు నిర్ణయించిన సమయాలలో దుకాణాలు నిర్వహించాలని, ఖచ్చితమైన రికార్డులు నిర్వహించాలని, స్టాక్, ధర వివరాలను బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాల‌ని ఆదేశించారు.
అదనంగా, సేవల నాణ్యతను మెరుగుపరచడం, అక్రమాలు నివారించడం, లబ్ధిదారులకు సమయానుసారంగా సరుకులు అందేలా చూడడం గురించి తగిన సూచనలు అందజేశారు.
ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశ్యం బాధ్యతా పద్ధతిని బలోపేతం చేయడం, అలాగే అర్హులైన లబ్ధిదారులకు అవసరమైన సరుకులు న్యాయంగా, పారదర్శకంగా, సమయానికి చేరేటట్లు చేయడం అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు