విశాలాంధ్ర – దేవరపల్లి : గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు పచ్చదనం పరిశుభ్రతకు గ్రామపంచాయతీలు కార్యదర్శులు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజలతో మమేకం కావాలని దేవరపల్లి ఎంపీడీవో సిహెచ్ నాగార్జున రావు పేర్కొన్నారు దేవరపల్లి పంచాయితీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పరిసరాల పరిశుభ్రత పచ్చదనం పరిశుభ్రతపై గ్రామ కార్యదర్శులకు పారిశుద్ధ్య కార్మికులకు డ్వాక్రా వివో ఏ లకు గత మూడు రోజుల నుండి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు శుక్రవారం నాడు దేవరపల్లిలో పల్లంట్ల రోడ్డులో గల చెత్త నుండి సంపద కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో గ్రామ సర్పంచ్ కడిమి వీర కుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీడీవో నాగార్జున మాట్లాడారు గ్రామ సర్పంచ్ కడిమి వీర కుమారి మాట్లాడుతూ గ్రామాలలో పచ్చదనం పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇంచి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె పేర్కొన్నారు గ్రామాలలో పర్యావరణ సక్రమంగా ఉంటేనే ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఆమె అన్నారు దేవరపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరీపట్నం సొసైటీ చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రతకు పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు గ్రామపంచాయతీలో ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి గ్రామాల అభివృద్ధికి పరిసరాల పరిరక్షణ కు కృషి చేయాలని అనిల్ సూచించారు దేవరపల్లి పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులు దేవరపల్లి గ్రామంలో ప్రతి వీధిని శుక్రవారం నాడు మరి శుభ్రపరిచారు ఈ సందర్భంగా ఆవరణలో పంచాయతీ కార్మికులు సిబ్బంది ఎంపీడీవో నాగార్జునసాగర్ పంచాయతీ కార్యదర్శి నెట్ట రవి కిషోర్ యాదవోలు పంచాయితీ కార్యదర్శి అంబటి దుర్గా లక్ష్మీ జమ్మి చెట్టు వద్ద పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవరపల్లి సొసైటీ చైర్ పర్సన్ ఉప్పులూరి రామారావు డిప్యూటీ ఎంపీడీవో వై రాజారావు డి ఎల్ డి వో స్లీవ్ రెడ్డి మండల తెలుగుదేశం నేతలు నున్న నాగేశ్వరరావు ఉండవల్లి రమేష్ దేవరపల్లి మండలంలో వివిధ పంచాయతీల కార్యదర్శిలు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు
పచ్చదనం పరిశుభ్రతకు
- Advertisement -
RELATED ARTICLES


