Homeఆంధ్రప్రదేశ్వైద్య ఆరోగ్య, స్త్రీ–శిశు సంక్షేమ శాఖల సంయుక్త సమీక్ష

వైద్య ఆరోగ్య, స్త్రీ–శిశు సంక్షేమ శాఖల సంయుక్త సమీక్ష

- Advertisement -

అంగన్‌వాడి కేంద్రాల్లో పిల్లల ఆరోగ్య పరీక్షలు —

విశాలాంధ్ర – తూర్పుగోదావరి : జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు శనివారం కలెక్టరేట్ పి.జి.ఆర్‌.ఎస్‌ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ–స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్త కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడి కేంద్రాల్లో నమోదు అయిన ప్రతి చిన్నారికి సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేయడం, వైద్య సేవలు అందించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా అధికారులు తెలిపారు. సమీక్ష సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మండలాల వారీగా మెడికల్ ఆఫీసర్లు అంగన్‌వాడి కేంద్రాల సందర్శన చేసి ప్రతి పిల్లవాడికి ఆరోగ్య పరీక్షలు చేయాలని తెలిపారు. తీవ్ర పోషకాహార లోపం ఉన్న పిల్లలు (SAM), మితమైన పోషకాహార లోపం ఉన్న చిన్నారులు (MAM), పెరుగుదలలో కుంటుపడిన పిల్లలు (Stunted) వంటి వర్గాలను గుర్తించి వారికి తక్షణ చికిత్సలు, ప్రత్యేక పర్యవేక్షణ అందించాల్సిన అవసరాన్ని వివరించారు. పి‌హెచ్‌సీ సిబ్బంది మరియు ఐసీడీఎస్ సిబ్బంది మధ్య సమన్వయం కీలకమని చెప్పారు. స్త్రీ–శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. శ్రీదేవి మాట్లాడుతూ, అన్ని అంగన్‌వాడి కేంద్రాల్లో పిల్లలకు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు జరగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాల అమలు, మాతా–శిశు సంరక్షణ సేవలు, వ్యాధినిరోధక టీకాలు, NTR ఆరోగ్య సేవలు, LCDC సర్వే, సాన్స్ సర్వే వంటి కార్యక్రమాల పురోగతిని డీఎంహెచ్‌వో సమీక్షించారు. అన్ని కార్యక్రమాలను 100 శాతం లక్ష్య సాధనతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారులు, మెడికల్ ఆఫీసర్లు, సిడిపిఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు