విశాలాంధ్ర, పార్వతీపురం: జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీకళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతిరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. బుదవారంనాడు ఉన్నత విద్యా మండలి ఆదేశాలు మేరకు కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవంను నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షత ఏడుగురు సభ్యులతోఏర్పడిన డ్రాఫ్టింగ్ కమిటీ ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులపాటు సేకరించి రాసిన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభచే ఆమోదించబడినదని, 1950 జనవరి 26 నుండి అమలలోకి వచ్చిందన్నారు.భారతరాజ్యాంగం ప్రవేశకతో ప్రారంభమైనదని తెలిపారు. భారతరాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగమని,అత్యున్నతమైన వ్యవస్థగా కొనియాడారు.భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా కళాశాల అధ్యాపకులతోనూ, విద్యార్థిని విద్యార్థులతో “భారత ప్రజలమైన మేము భారతదేశంలో సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రరాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయన్యాయాన్ని ఆలోచనలోనూ, భావప్రకటనలోను, విశ్వాసములోనూ, నమ్మకంలోనూ, ఆరాధనలోను, స్వేచ్ఛను స్థితిగతులలోనూ, అవకాశాలలోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి, అందరిలో వ్యక్తిగౌరవాన్ని జాతీయసమైక్యతను సంరక్షిస్తూ సౌబ్రాతత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ లో తీర్మానం చేసుకొని శాసనముగా రూపొందించుకున్న
ఈరాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము” అని ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగఅంగాలైన ప్రజలు,ప్రదేశం,ప్రభుత్వం, సార్వభౌమాధికారం గూర్చి వివరించారు.లిపారు. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రరాజ్యముల గూర్చి, ప్రపంచ దేశాలనుండి రాజ్యాంగాల నుండి సేకరించిన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు,ఆదేశిక సూత్రాలు, అత్యవసర పరిస్థితులు తదితర అంశాలను గూర్చి వివరించారు. వైస్ ప్రిన్సిపాల్ బలగ శాంతకుమారి భారత రాజ్యాంగ దినోత్సవ ఆవిష్కతను, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం గుండెవంటిదని చెప్పారు. వైస్ ప్రిన్సిపాల్ & ఐక్యూఏసి కో ఆర్డినేటర్ బలగ శాంతకుమారి ,సీనియర్ లెక్చరర్ కె రోజా,అధ్యాపకులు ఎన్ సత్యనారాయణ,కొత్తాడ శంకరరావు, ఎం సౌజన్య,పాలిటిక్స్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు బంకురు తిరుపతిరావు, ఎం.రమేష్,వైకుంఠరావు,ఎం ఎల్లంనాయుడు, గుప్తా,
కె శ్రీనివాసరావు,శంకరరావు, పల్గునరావు, ఎన్ వెంకటరమణ, ఉమామల్లేశ్వరి, గౌరీశంకర్రావు, టి కిషోర్ కుమార్,నరేంద్ర, జగదీశ్వరరావు, హేమసుందరరావు, డాక్టర్ శంకరరావు, గణేశ్ కుమార్, మాధవనాయుడు,వాసు,సురేష్, నవీన్ కుమార్లు,కళాశాలవిద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను, పలు రకాల పోటీలను నిర్వహించారు.
ఎస్వీ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఘనంగా రాజ్యాంగదినోత్సవ కార్యక్రమం
- Advertisement -
RELATED ARTICLES


