Homeజిల్లాలుఅనంతపురంవైద్య ఆరోగ్యశాఖలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ

వైద్య ఆరోగ్యశాఖలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ

- Advertisement -

విశాలాంధ్ర – అనంతపురం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి అధ్యక్షతన కార్యాలయ లో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగం దాని ఆవశ్యకత పై వివరించడం జరిగింది అనంతరం రాజ్యాంగ పీఠిక చదివి వినిపించారు.
అలాగే రాజ్యాంగ పీఠిక కు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించడం జరిగినది, ఈ సందర్భంగా డాక్టర్ డియం ఎచ్ ఓ ఈ బి దేవి మాట్లాడుతూ ఈరోజు ఎంతో ముఖ్య మైన రోజని ,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన , రాజ్యాంగం ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిందని రాజ్యాంగంలో భారత దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు అందించే ల అలాగే స్వేచ్ఛ సమానత్వంతో జీవించేలా సమాన గౌరవం పొందేలా మౌలిక హక్కులు, మౌలిక కర్తవ్యాలు, విదాన మార్గదర్శకాలు, గురించి వివరించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు , డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ విష్ణుమూర్తి, ఏ ఓ. గిరిజా మనోహర్ రావు ,డెమో నాగరాజు, హెచ్ ఇ ఇ ఒ, ఎం, త్యాగరాజు, డిప్యూటీ హెచ్ ఓ , గంగాధర్, మరియు సీనియర్ అసిస్టెంట్స్ కమలాకర్ రాజు, అశోక్, రాజేష్, రంగనాథ్, మల్లి కార్జున, సిబ్బంది పాల్గొన్నారు,

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు