విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండలంలో బుధవారం నాడు సుబ్రహ్మణ్య షష్టి పర్వదినం సందర్భంగా మండలంలో వివిధ గ్రామాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారి జాము నుండి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయాలలో భక్తులు సుబ్రహ్మణ్య స్వామి నామంతో నినాదాలు చేస్తూ దేవదర్శనం చేసుకున్నారు దేవరపల్లిలో కదా అతి పురాతనమైన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున మూడు గంటల నుండి అభిషేకాలు పూజలు ప్రారంభమయ్యాయి ఆలయ ప్రధాన అర్చకులు అఖండం వెంకటరాజు శర్మ అఖండం వంశీకృష్ణ సతీష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు భక్తులు బారులు తీరి దైవదర్శనం చేసుకున్నారు మండలంలో కురుకూరు పల్లంట్ల ఎర్నగూడెం త్యాజంపూడి దుద్దుకూరు బందపురం గౌరీపట్నం గ్రామాలలో భక్తులు ఆలయాల వద్ద బారులు తీరి దేవదర్శనం చేసుకున్నారు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆలయం వద్ద విస్తృత ఏర్పాటు చేశారు
దేవరపల్లి లో షష్టి
- Advertisement -
RELATED ARTICLES


