విశాలాంధ్ర – దేవరపల్లి : భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి రాజ్యాంగ స్ఫూర్తిని పొందాలని దేవరపల్లి సొసైటీ చైర్పర్సన్ ఉప్పులూరి రామారావు సొసైటీ సీఈవో కల్లూరి శ్రీనివాస శర్మ పేర్కొన్నారు దేవరపల్లి లో సొసైటీ కార్యాలయం వద్ద భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సొసైటీ చైర్ పర్సన్ ఉప్పులూరి రామారావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారత దేశ రాజ్యాంగం ఎంతో గొప్పదని ముఖ్యంగా లిఖిత రాజ్యాంగం కావడం వలన ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భారతదేశ రాజ్యాంగం పేరు ప్రఖ్యాతులు గడిచిందని ఆయన అన్నారు ఈ సందర్భంగా దేవరపల్లి సొసైటీ పరిధిలో గల రామన్నపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్థులకు రాజ్యాంగం సహకారం అన్ని అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు వ్యాసరచన పోటీలలో ప్రథమ స్థానం సాధించిన జె సిరివల్లికకు వెయ్యి రూపాయలు రెండువస్తాను సాధించిన ఈ నాగజ్యోతికి 800 రూపాయలు 3వ స్థానం సాధించిన డీకే సతీష్ కు 600 రూపాయలు నగదు బహుమానమును సొసైటీ చైర్ పర్సన్ ఉప్పులూరు రామారావు సీఈవో కల్లూరి శ్రీనివాస శర్మ స్థానిక నాయకుల సమక్షంలో అందజేశారు ఈ కార్యక్రమంలో రామన్నపాలెం హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పేరం రవీంద్రనాథ్ రామన్నపాలెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాట్రగడ్డ మోహన్ తెలుగుదేశం నాయకుడు పరిమి శ్రీ రామకృష్ణ ఉపాధ్యాయులు వివి శ్రీనివాస్ ఎస్.కె అహ్మద్ భాష దేవరపల్లి తెలుగుదేశం నాయకులు నందిగం శ్రీధర్ పిన్నమనే నవీన్ సొసైటీ సిబ్బంది గుడ్ల వెంకటేశ్వరరావు మణికంఠ రమేష్ తదితరులు పాల్గొన్నారు
భారత రాజ్యాంగం పట్ల ఉప్పులూరి
- Advertisement -
RELATED ARTICLES


