Homeఆంధ్రప్రదేశ్స్వర్ణ వేలాయుధం - కంబాల సంకల్పం

స్వర్ణ వేలాయుధం – కంబాల సంకల్పం

- Advertisement -

శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 25 లక్షలు రూపాయలతో స్వర్ణ వేలాయుధం..

భక్తులు కంబాల శ్రీనివాసరావు సంకల్పం

తొలితగా 13 లక్షలు రూపాయలతో 100 గ్రాములు బంగారం కొనుగోలు…

విశాలాంధ్ర – కోరుకొండ : కోరుకొండ గ్రామం ప్రధాన రహదారిలో కొలివై ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 25 లక్షలు రూపాయల వ్యయంతో స్వర్ణ వేలాయుధం చేయించడానికి భక్తులు విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు సంకల్పించారు. గురువారం కోరుకొండలో ప్రారంభమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. తొలిత ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆయన ఘన స్వాగతం పలికి పూలమాలతో సత్కరించారు. ఆలయంలో స్వామివారి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవలే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ నూతన పున :ప్రతిష్ట జరిగిందన్నారు. అప్పుడు ఆలయాన్ని సందర్శించినప్పుడు స్వామివారి చేతిలో ఉండే ఆయుధమైనా వేలాయుధం 25 లక్షలు రూపాయల వ్యయంతో, స్వర్ణ వేలాయుధం చేయిస్తానని, ప్రకటించడం జరిగిందన్నారు. అప్పుడు మాజీ సర్పంచ్ కటకం చలంకి లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగిందని, ఆయన వాటితో తులం బంగారం కొనుగోలు చేశారన్నారు. మంగళవారం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి రాజమహేంద్రవరం భీమా జ్యువెలర్స్ లో 13 లక్షల రూపాయలతో 24 క్యారెట్ల 100 గ్రాములు బంగారాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ బంగారాన్ని షష్టి సందర్భంగా స్వామివారి సన్నిధిలో పెట్టడం జరిగిందన్నారు. అలాగే డిశంబర్ నెలలో మరో 14 తులాల బంగారాన్ని కొనుగోలు చేసి మొత్తం 25 తులాల బంగారంతో వేలాయుధం తయారు చేయించి, కోరుకొండ మండలంలో ప్రతి గ్రామానికి ప్రజల దర్శనార్థం ఊరేగించి, స్వామివారికి అలంకరించడం జరుగుతుందన్నారు. అలాగే కాప వీరబాబు అనే వ్యక్తి గత రెండేళ్ల క్రితం రథం కింద పడి కాలు నలిగిపోయి, కాలును తొలగించారు. కంబాల శ్రీనివాసరావు వద్దకు వచ్చి సహాయం చేయాలని కోరగా స్పందించిన ఆయన జైపూర్ నుంచి లక్ష రూపాయలు వ్యయంతో కృత్రిమ కాలును తెప్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆలయ బ్రాహ్మణులు ఉండటానికి వసతి గృహాన్ని నిర్మించాలని కమిటీ సభ్యులు కోరగా, నిర్మాణానికి సహాయం అందిస్తానని ప్రకటించారు. అనంతరం రామసేన కార్యాలయం వద్ద భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు