Homeఆంధ్రప్రదేశ్పొట్టిలంకలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

పొట్టిలంకలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం పొట్టిలంకలో 76 వ రాజ్యాంగ దినోత్సవాన్ని  అంబేడ్కర్ యువజన సంఘం, జై భీమ్ యూత్ ఆధ్వరయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. బహుజన సమాజ్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్  నక్కా వెంకట రత్న రాజు అంబేడ్కర్ విగ్రహానికి నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది త్యాగధనుల పోరాటంతో మనదేశం1947 ఆగష్టు 15 న స్వతంత్ర్యం భారత గా అవతరించింది. స్వతంత్ర్య దేశానికి రాజ్యాంగం ఉండాలనే అవశ్యకత ను గుర్తించి, రాజ్యాంగం తయారీకి సహచరులతో కలిసి రూపకల్పన చేసిన అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుని స్మరించు కోవాలన్నారు. అనేక కష్ట నష్టాలు, ఒడిదుడుకులు , అనారోగ్య సమస్యలు నడుమ , సుమారు 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కష్టించి అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 న అమలులోకి వచ్చిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలన్నదే అంబేద్కర్ రాజ్యాంగం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో కలిదిండి గోవిందు, కొత్తపల్లి శ్రీరాములు, న్యాయవాది బడుగు సత్తిబాబు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు నక్కా చంటి బాబు, నానాజీ, కప్పల బాస్కర్రావ్ , కొల్లపు వీరన్న , మొగలపు రాజు , గుర్రం కళ్యాణ్ , కొండేపూడి చిన్న , నెల్లి అన్నవరం , కొల్లపు ఆమోసు , జక్కల నాని , నాంబత్తుల సత్తిపండు , నేరిమెల్లి ప్రవీణ్ , నూకపేయ్యి శేఖర్ , ఏద్దు కార్తీక్ , రాయుడు విజయ్ , కోల్లపు డాన్ , తాళ్ళ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు