Homeఆంధ్రప్రదేశ్బాధ్యతలు స్వీకరణ

బాధ్యతలు స్వీకరణ

- Advertisement -

జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారి బాధ్యతలు స్వీకరణ

విశాలాంధ్ర – సీతానగరం: మండలంలో గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారి ఎమ్ వెంకట రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ సచివాలయ వ్యవస్థలో పెను మార్పులలో తీసుకొచ్చే విధంగా అనేక సంస్కరణ కార్యక్రమాలను చేపట్టారు. దీనిలో భాగంగా ప్రతి మండలంలోని గ్రామీణ సచివాలయ వ్యవస్థ పై ఒక అధికారిని నియమించే విధంగా జీవోలను జారీ చేశారు. దీనిలో భాగంగా సీతానగరం మండలం గ్రామీణ సచివాలయ అధికారిగా స్వస్థలం పెదపూడి కాకినాడకు చెందిన  ఎమ్ వెంకట రెడ్డి మండల అడ్మినిస్ట్రేటివ్ అధికారి సుబ్రమణ్యంకు విధులకు హాజరవుతున్నట్లు నివేదిక అందించారు. ఈ అధికారికి  ఇనగంటివారిపేట, మిర్తిపాడు ఇరు గ్రామాలకు చెందినా ఇద్దరు మహిళా పోలీసులను సిబ్బందిగా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ గోపాల్, కార్యదర్శులు టి ఎస్ శ్రీనివాస్, కిరణ్, కంప్యూటర్ అసిస్టెంట్ సతీష్, జూనియర్ అసిస్టెంట్ సుమతి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు