Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఈవీఎంల గోడౌన్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్

ఈవీఎంల గోడౌన్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మార్కెట్ యార్డు నందు ఉన్న ఈవీఎం గోడౌన్లను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం నెల వారి తనిఖీల్లో భాగంగ రావడం జరిగిందని, ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ల భద్రతకు తీసుకుంటున్న జాగ్రత్తలను వారు సమీక్షించారు.ఈ సందర్భంగా గోడౌన్ వద్ద సీసీ కెమెరా వ్యవస్థ, ఫైర్ సేఫ్టీ, 24 గంటల భద్రతా ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందన్నారు.తదుపరి సంబంధిత అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ఈవీఎంల భద్రతలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, భద్రతా నిబంధనలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీవో మహేష్, గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులు, ఎమ్మార్వో సురేష్ బాబు,రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు