Homeజిల్లాలుఅనంతపురం3 న చలో విజయవాడ అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన యాత్ర జయప్రదం చేయాలి

3 న చలో విజయవాడ అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన యాత్ర జయప్రదం చేయాలి

- Advertisement -

సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ శ్రీరాములు,

రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ. సిద్దేశ్వరరావు పిలుపు

విశాలాంధ్ర -అనంతపురం: డిసెంబర్ 3 న చలో విజయవాడ అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన యాత్ర జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ శ్రీరాములు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ. సిద్దేశ్వరరావులు పిలుపునిచ్చారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నీలం రాజశేఖర్ రెడ్డి భవనంలో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ శ్రీరాములు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ. సిద్దేశ్వరరావులు మాట్లాడతు… అగ్రిగోల్డ్ బాధితులపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని నాయకులు తీవ్రంగా ఖండించారు. పదేళ్లుగా వేలాది డిపాజిటర్లు ఆర్థిక, మానసిక, ఆరోగ్యపరమైన కష్టాల్లో అల్లాడుతుండగా, ఎన్నికల ముందు బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలు నేడు అమలు కాకపోవడం బాధాకరమన్నారు . కంపెనీకి స్పష్టమైన ఆస్తులు ఉన్నప్పటికీ డిపాజిటర్లకు చెల్లింపులు జరగకపోవడం వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తోందన్నారు. డిసెంబర్ 3న విజయవాడలో జరిగే ఆవేదనా యాత్ర బాధితుల న్యాయ పోరాటానికి చారిత్రాత్మక మలుపవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు, ప్రత్యేక సిట్‌తో దర్యాప్తు, ఆస్తుల మ్యుటేషన్—వేలం ప్రక్రియలను కోర్టు పర్యవేక్షణలో 2015కు ముందు రిజిస్టర్ చేసిన ప్లాట్లు–ఫ్లాట్లను బాధితులకు అందించడం, యాజమాన్య కుటుంబాల పేర్లలో ఉన్న బెనామీ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్నారు. అబ్సల్యూట్ చేయడం, ఈ కాలంలో మరణించిన బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం వంటి కీలక డిమాండ్లను అసోసియేషన్ ముందుంచింది తెలిపారు. ఈ సందర్భంగా డిసెంబర్ 3 న ఉదయం 10 గంటలకు విజయవాడ కళాక్షేత్రం–ధర్నా చౌక్ వద్ద జరిగే ఆవేదనా దీక్షల్లో ప్రతి కస్టమర్, ప్రతి ఏజెంట్, ప్రతి కుటుంబం పాల్గొని ‘మాకు మా డిపాజిట్లు కావాలి… ఇప్పుడే కావాలి!’ అనే నినాదంతో ఐక్యంగా ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అసోసియేషన్ తరఫున రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ. సిద్దేశ్వరరావు, జిల్లా కార్యదర్శి డి. కుళ్లయప్పా, జిల్లా ఉపాధ్యక్షులు ధమనజయ్య
, జిల్లా కార్యదర్శి సి. కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు