Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచిన్నారికి విజయవంతమైన శస్త్రచికిత్స

చిన్నారికి విజయవంతమైన శస్త్రచికిత్స

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం గుంజేపల్లి గ్రామానికి చెందిన కణం విశ్వనాధ్ కి ఇద్దరు కవల పిల్లలు. ఇద్దరిలో ఒక బాలుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉండగా, చిన్నారి అక్షిత్ పుట్టుకతోనే రెండు కాళ్లు పనిచేయని పరిస్థితిలో జన్మించాడు. పుట్టినప్పటి నుండి కాళ్లు నిశ్చలంగా ఉండడంతో నడవలేని స్థితి నెలకొంది. కుటుంబం అనేక చోట్ల చికిత్స కోసం దర్శించుకున్నా పెద్దగా మార్పు లేక, తీవ్ర నిస్సహాయ స్థితిలో జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ బాధను వివరించి, ఆశ్రయం కోసం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య డ వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ము ప్రత్యక్షంగా సంప్రదించారు. విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి సత్య కుమార్ యాదవ్ హృదయపూర్వకంగా స్పందించారు. చిన్నారి వైద్య వివరాలను స్వయంగా పరిశీలించి, వెంటనే తిరుపతిలోని బర్డ్ ప్రత్యేక వైద్యశాల వైద్యులతో మాట్లాడారు. అత్యవసర శస్త్రచికిత్స చేయించేందుకు అవసరమైన విధంగా అన్ని ఏర్పాట్లు చేయించి, బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించే చర్యలు చేపట్టారు. మంత్రివర్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. ప్రస్తుతం చిన్నారి అక్షిత్ ఆరోగ్యంగా కోలుకుని ఇంటికి చేరుకున్నారు. పిల్లవాడి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుండటం కుటుంబానికి ఎంతో నైతిక బలం నిచ్చింది.
తమ కుమారుడికి కొత్త ఆశను అందించినందుకు కృతజ్ఞతాభివందనాలతో బాలుడి తల్లిదండ్రులు మంత్రి సత్యకుమార్ యాదవ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో కుటుంబ సభ్యులు మంత్రి సత్య కుమార్ యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. అత్యవసర సమయంలో మాకు సహాయం చేసి, మా పిల్లవాడికి జీవం పోశారు అని, మేము జీవితాంతం ఆ ఉపకారాన్ని మరువం అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు