Homeజిల్లాలుఅనంతపురంసీపీఐ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేద్దాం .. సిపిఐ నేత గోవింద్

సీపీఐ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేద్దాం .. సిపిఐ నేత గోవింద్

- Advertisement -

విశాలాంధ్ర, పామిడి: సీపీఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోవింద్ పిలుపునిచ్చారు. పామిడి మండల కేంద్రంలోని షాదీఖానాలో శనివారం జరిగిన సీపీఐ మండల కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన గోవింద్‌ను పార్టీ నాయకులు కే. రహీం, నాగరాజు, చౌడప్ప, కోదండరామిరెడ్డి పూలమాలతో సన్మానించారు.పార్టీ స్థాపన నుంచి భూమి, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నిర్మూలన కోసం, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు మొదలుపెట్టిన పార్టీ సీపీఐ అని గోవింద్ గుర్తుచేశారు. వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచడమే కాకుండా కార్మిక, విద్యార్థి, యువజన, రైతు, మహిళా సంఘాలను నిర్మించి, కార్మిక, కర్షక హక్కుల కోసం సీపీఐ రాజీ లేని పోరాటాలు చేపట్టిందని వివరించారు.ఈ కార్యక్రమంలో ఎర్రగుడి రాముడు, చౌడప్ప, ఆటో యూనియన్ నాయకులు, మహిళా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు