విశాలాంధ్ర-తాడిపత్రి: సామాజిక పెన్షన్ పెంపు చంద్రబాబు తోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ 268 బూత్ ఇంచార్జ్ బిఎల్ఎ కె.చిన్నబాబు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని 35వ వార్డు నందలపాడు ఎస్సీ కాలనీ నందు బూత్ ఇన్చార్జి కె.చిన్నబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కె.చిన్నబాబు మాట్లాడుతూ నందలపాడు ఎస్సీ కాలనీ నందు సుజాత అనే మహిళకు భర్త చనిపోయిన రెండు నెలలకే పెన్షన్ మంజూరు హర్షణీయమన్నారు. మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం.పవన్ కళ్యాణ్, మున్సిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు జెసి. అస్మిత్ రెడ్డి ఆదేశాలు మేరకు 35వార్డు నందలపాడు సుజాత కు కూటమి ప్రభుత్వం ద్వారా రెండు నెలలలోపే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అమలు చేశారన్నారు. పెన్షన్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి సుజాత కృతజ్ఞతలు తెలిపి, ఆనందంతో పెన్షన్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది అనిల్ పాల్గొన్నారు.


