చెదురు మదుర జల్లులతో రైతులు ఆందోళన
– అన్ని గ్రామాలలో కాలాల్లోనే ధాన్యం
విశాలాంధ్ర – సీతానగరం: తుపాన్ ప్రభావంతో మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం చెదురు మదుర జల్లుల పడ్డాయి. గత కొన్ని రోజులుగా వరిలో పి ఎల్ రకం కోతలు జోరుగా సాగుతున్నాయని. వీటిని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయించేందుకు రైతులు ధాన్యాన్ని అందుబాటులో ఉన్న కాలీ ప్రదేశాల్లో ఎండబెడుతున్నారు. అయితే దిత్యా తుపాన్ ప్రభావంతో కొన్ని చోట్ల జల్లులు పడుతుండడంతో రైతులు కాలాల్లో ఉన్న ధాన్యం వద్దకు టార్ప్లిన్ బారకలు పట్టుకొని పరుగులు తీశారు. టార్ప్లిన్ బారకలు అందుబాటులో లేని రైతులు సంచుల బరకాలను కప్పి ధాన్యాన్ని వర్షము నుండి రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని గ్రామాలలో ఖరీఫ్ సీజన్లో సుమారు 4800 ఎకరాలు వరి పంట సాగు చేసారు. ఇప్పటివరకు సుమారు 70 శాతం మేర పంటలను కోతలు కోశారు. అలాగే 30 శాతం పంట కాలాల్లోనే ఉంది. జల్లులతో తుఫాను తీరం దాటితే చాలామంది రైతులు తుఫాను బారిన పడకుండా పంటలను కాపాడే అవకాశం ఉందని రైతులు చెపుతున్నారు


