Homeఆంధ్రప్రదేశ్ఘనంగా గీత జయంతి వేడుకలు

ఘనంగా గీత జయంతి వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర – కొవ్వూరు : కొవ్వూరు పట్టణంలో ఎబిఎన్ పిఆర్ ఆర్ కళాశాలలో సోమవారం ఘనంగా గీత జయంతి వేడుకలు జరిగాయి. కురుక్షేత్ర యుద్ధంలో నిస్సహాయ స్థితిలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు జీవిత తత్వశాస్త్రం, కర్మ, మోక్షం వంటి విషయాలను వివరించి, కర్తవ్య నిర్వహణకు మార్గనిర్దేశం చేసిన రోజు ఈ రోజు అని, ఈ పవిత్ర గ్రంథం అర్జునుడికే కాదు కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎదురయ్యే సమస్యలకి, సందిగ్ధతకు సమాధానంగా నేటి ఆధునిక యుగంలోనూ భగవద్గీత ప్రమాణంగా నిలుస్తోంది. ముఖ్యంగా భగవద్గీత సారాంశంలో నిష్కల్మషంగా మనం చేయవలసిన పని చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా మన ప్రయత్నం చేయాలి అని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా రమేష్ అన్నారు. కళాశాలలో గీత జయంతి సందర్భముగా కళాశాల తెలుగు మరియు సంస్కృతం విభాగములు ఏర్పాటు చేసిన కార్యక్రమములో అయన అధ్యక్షత వహించారు, ఈ సందర్భముగా విద్యార్థిని విద్యార్థులు భగవద్గీత కు పూజ చేసి శ్లోకములను పఠించారు. భగవద్గీత యొక్క విశిష్టతను అధ్యాపకులు జయరామలక్ష్మి, నూకరత్నం తెలియచేసారు. ఈ కార్యక్రమములో విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా భగవద్గీత శ్లోకములు పఠించిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందచేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు