ప్రజలకు మెరుగైన సేవలు * అధికారులకు పరిపాలన సులభతరం
– పంచాయతీ రాజ్ వ్యవస్థలో పర్యవేక్షణ బలోపేతానికి కృషి
– ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో అట్టహాసంగా
డిడివో కార్యాలయం ప్రారంభం
– జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
విశాలాంధ్ర – రాజానగరం : ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటుగా అధికారులకు పరిపాలన సులభతరం చేసేందుకు డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలు దోహదపడతాయని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నందు గురువారం జరిగిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తొలుత ఎంఎల్‌సీ సోము వీర్రాజు,అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి,రుడా ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, డివిజనల్ అభివృద్ధి అధికారి పి.వీణా దేవి,వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు. దీనిలో భాగంగా కార్యాలయం ప్రాంగణాన్ని పరిశీలించారు.పలువురు అధికారులు సేవలను గుర్తించి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలన వ్యవస్థలో అవలంబిస్తున్న సంస్కరణల నేపథ్యంలో పంచాయతి రాజ్ వ్యవస్థ కార్యకలాపాలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను రాజమహేంద్రవరం మరియు కొవ్వూరు డివిజన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.రెవెన్యూ వ్యవస్థలో ఆర్డీవో విధానం ఉన్నట్లుగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో కూడా పర్యవేక్షణ బలోపేతానికి ఈ డివిజనల్ అభివృద్ధి అధికారి వ్యవస్థ ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేశారు.నూతన విధానం అమలుతో డివిజనల్ గ్రామ పంచాయతీ అధికారి, ఉపాధి హామీ,అధికారులు, సచివాలయ సిబ్బంది ఒకేచోట పనిచేయడం ద్వారా పరిపాలనలో వేగం, జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అభివృద్ధి పనుల నిమిత్తం మండల స్థాయిలో ఎంపిడివోను సంప్రదించాల్సి వచ్చే దని, ఇకపై డివిజన్ స్థాయిలోనే సేవలు అందుబాటు లోకి వస్తాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 75 డివిజన్లలో ఈ కార్యాలయాలు ఒకేసారి ప్రారంభించి నట్టు చెప్పారు.విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎంఎల్‌సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా జరిగే పనులను పర్యవేక్షించడానికి ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందన్నారు.గ్రామ సచివాలయాల పనితీరును విశ్లేషించి లోపాల్ని తక్షణమే పరిష్కరించేలా ఈ కార్యాలయాలు సేతువులా పనిచేస్తాయని, ప్రజలకు త్వరితగతిన సేవలు అందుబాటులోకి రావడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.మరో అతిథిగా హాజరైన అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ చాలా కాలం తరువాత పంచాయతి రాజ్ పరిపాలనలో క్రమబద్ధీకరణ సాధ్యమవుతుందని, పోలీస్ వ్యవస్థలో డీఎస్పీ, రెవెన్యూ వ్యవస్థలో ఆర్డీవో ఉన్నట్లుగానే పర్యవేక్షణ కోసం డిడివో వ్యవస్థ అమలు లోకి రావడం అభినందనీయమన్నారు.ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సూచనలతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదంతో రాష్ట్రవ్యాప్తంగా వర్చువల్ విధానంలో ఈ కార్యాలయాలు ప్రారంభించబడ్డాయని తెలిపారు.
అనంతరo భవన నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసినందుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.వెంకట గిరి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తమ్మిరెడ్డి శ్రీనివాస బాబు, అసిస్టెంట్ ఇంజనీర్ వేచర్ల అవినాష్ , కాంట్రాక్టర్ ఎన్. సురేష్ (దొరబాబు),పంచాయతీ కార్యదర్శి చదలవాడ మురళిలను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరీ, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి. శాంత మణి, డివిజనల్ అభివృద్ధి అధికారి పి. వీణా దేవి, డివిజనల్ గ్రామ పంచాయతీ అధికారి ఎమ్. నాగలత, ఎస్.ఇ. ఆర్‌డబ్ల్యూఎస్ బి.వి.రెడ్డి గిరి , డి ఈ శ్రీనివాస్, ఏ ఈ అవినాష్, ఎంపిడివో ఝాన్సీరాణి, తహశీల్దార్ జి.అనంత లక్ష్మీ సత్యవతి దేవి,కార్యదర్శి మురళి, కాంట్రాక్టర్ సురేష్ ,హౌసింగ్ బోర్డు టీడీపీ అధ్యక్షులు రాయుడు శ్రీనివాస్, రైల్వే బోర్డు అడ్వైజరీ సభ్యులు బొమ్ముల సతీష్, కూటమి నాయకులు కార్యకర్తలు,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
ప్రజలకు మెరుగైన సేవలు
- Advertisement -
RELATED ARTICLES


