విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని మాజీ ఎఫ్ పి షాపు డీలర్లకు రావలసిన డబ్బును ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆర్డిఓ మహేష్ కు వైఎస్ఆర్సిపి నాయకులు దేవరకొండ రమేష్, రమాదేవి, దాడి తోట కృష్ణ,, కోళ్లమరం కేశవరెడ్డి, బెస్త వెంకటరమణ తదితరులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2015 వ సంవత్సరం నుంచి 2023 వ సంవత్సరం వరకు ధర్మవరం అర్బన్, రూరల్ – ఎఫ్ పి షాప్ డీలర్లకు రావలసిన, ఐసీడీస్-అర్బన్, రూరల్ కి – రూ.4,05,995, యం డి యం-అర్బన్ రూరల్ కి రూ.6,98,595, మొత్తం రూ.11,04,590 సివిల్ సప్లైకి సంబంధించిన-యస్ సి యo అకౌంట్ లొ మాకు రావాల్సిన కమిషన్ ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. కావున వెంటనే మా కమిషన్ నగదును వెంటనే ఇప్పించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలొ సబియా,పోతిరెడ్డి,అంకే నరసింహులు,దాసరి రాము, తిరుపాలు, శివుడు, పరశురామిరెడ్డి,ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎఫ్ సి షాపు డీలర్లకు రావలసిన డబ్బును ఇప్పించండి.. దేవరకొండ రమేష్
- Advertisement -
RELATED ARTICLES


