Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజాతీయస్థాయి బాస్కెట్ బాల్ అండర్ -19 జట్టుకు ధర్మవరం బాల బాలికలు ఎంపిక

జాతీయస్థాయి బాస్కెట్ బాల్ అండర్ -19 జట్టుకు ధర్మవరం బాల బాలికలు ఎంపిక

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం : జాతీయ స్థాయిలో జనవరి 1 తేదీ నుండి 06 తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలో జరిగే 69 వ నేషనల్ స్కూల్ గేమ్స్ అండర్ బి19 జాతీయ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ జట్టు ధర్మవరం పట్టణానికి చెందిన విజయ్ తరుణ్, బాలికల విభాగంలో కిరణ్మయి , ధర్మవరం పట్టణానికి బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎంపిక కావడం గర్వకారణమని ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అసోసియేట్ సెక్రటరీ, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రా రెడ్డి తెలిపారు.గత నెల నందు విజయవాడ నగరంలో జరిగిన జిల్లా జట్లకు ప్రాతినిత్యం వహించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపి ఆంధ్ర ప్రదేశ్ జట్టుకు ఎంపికయ్యారు అని తెలిపారు. వీరి ఎంపిక పట్ల యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎస్ నాయుడు, ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, కోచ్ సంజయ్ , ఆత్మీయ ట్రస్ట్ సభ్యులు హర్జిత్ ప్రణవ్, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.జాతీయ స్థాయిలో వీరు రాణించి ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారుఎంపికైన క్రీడాకారులు ఆదివారం రోజున బయల్దేరి రాజస్థానీకి వెళ్లారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు