విశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లా షూటింగ్ బాల్ చాంపియన్‌షిప్–2025 (సీనియర్ మహిళల విభాగం)లో రిషి విద్యాలయ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని సిరి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని యాజమాన్యం తెలిపింది. అనంతరం యాజమాన్యం నిర్వాహకులు మాట్లాడుతూ ఈ పోటీలు కావలి డీబీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించబడగా, సిరి అత్యుత్తమ ప్రతిభ కనబరచి ఎంపికైంది అని తెలిపారు. రానున్న జాతీయ స్థాయి పోటీలు మహారాష్ట్ర సోలాపూర్‌లో జరగనున్నాయి అని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలనే లక్ష్యంతో రిషి విద్యాలయ పాఠశాల నిరంతరం ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జింకా ఉదయ్ కుమార్ పాఠశాల యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సహకారం, ప్రోత్సాహం వల్ల విద్యార్థినికి ఈ స్థాయి అవకాశం దక్కిందని డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ప్రిన్సిపాల్ కరణ్ స్వరూప సింగ్ , సీఏఓ రవీంద్ర గారు, వైస్ ప్రిన్సిపాల్ కల్యాణి, ఏ.ఓ రంగారెడ్డి సిరిని అభినందించి, జాతీయ స్థాయిలో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లా షూటింగ్ బాల్ చాంపియన్‌షిప్–2025లో రిషి విద్యాలయ విద్యార్థిని జాతీయ స్థాయికి ఎంపిక
- Advertisement -
RELATED ARTICLES


