Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజాతీయస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలకు ఢిల్లీకు పయనమైన బిఎస్సార్ విద్యార్థినిలు..

జాతీయస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలకు ఢిల్లీకు పయనమైన బిఎస్సార్ విద్యార్థినిలు..

- Advertisement -

హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని సంజయ్ నగర్లో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల లో చదువుతున్న 11 మంది విద్యార్థినీలు జనవరి 4వ తేదీ నుండి ఏడవ తేదీ వరకు జాతీయస్థాయి ఫ్లోర్ బాల్ క్రీడా పోటీలకు ఢిల్లీలోని రోహిణీలోని యువశక్తి మోడల్ స్కూల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మా పాఠశాల ద్వారా జాతీయ స్థాయికు 11 మంది విద్యార్థినీలు పాల్గొంటున్నారని తెలిపారు. అక్కడ కూడా మంచి ప్రతిభను ఘనపరిచి మన రాష్ట్రానికి, దేశానికి, జిల్లాకు, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొని రావాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ తో పాటు పిడి, పాఠశాల కమిటీ చైర్మన్, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మండల విద్యాశాఖ అధికారులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు