Homeజిల్లాలుశ్రీ సత్యసాయికౌశల్ పోటీలో చైతన్య లక్ష్మి ప్రతిభ ..అభినందించిన పాఠశాల హెడ్మాస్టర్

కౌశల్ పోటీలో చైతన్య లక్ష్మి ప్రతిభ ..అభినందించిన పాఠశాల హెడ్మాస్టర్

- Advertisement -

విశాలాంధ్ర- ధర్మవరం : ఈనెల 26వ తేదీన తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠంలో జరిగిన రాష్ట్రస్థాయి కౌశల్ పోటీల్లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ ప్రభుత్వ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బండారు చైతన్య లక్ష్మి తన ప్రతిభతో రాష్ట్రస్థాయిలో నాలుగవ స్థానం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ చైతన్య లక్ష్మి చదువులో కూడా ముందంజలో ఉందని, వివిధ రకాల పోటీలకు ఎల్లప్పుడూ ముందుండి పాల్గొంటుందని తెలిపారు. తొలుత చైతన్య లక్ష్మి ఆన్లైన్ మండల లెవెల్ లో ఎంపిక, తదుపరి జిల్లా లెవెల్లో ఎంపిక తర్వాత, రాష్ట్రస్థాయి తిరుపతిలో రాత పరీక్షలో నాలుగో స్థానం పొందడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. జిల్లాకు, మా పాఠశాలకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. కొత్త చెరువులో జరిగిన కార్యక్రమంలో కూడా డిఇఓ చేతులమీదుగా నగదు బహుమతితో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రమును అందుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాల ప్రార్థనా సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు నడుమ చైతన్య లక్ష్మి ని ప్రత్యేకంగా అభినందించి, శుభాకాంక్షలును తెలియజేశారు. మా పాఠశాలలో చదువుతోపాటు క్రీడలకు, విద్య కు సంబంధించిన పోటీలకు కూడా మా ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారని వారు తెలిపారు. చైతన్య లక్ష్మి రాష్ట్రంలో నాలుగవ స్థానం రావడానికి మా పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసే సుకన్య కృషి అన్యనీయమని తెలుపుతూ వారిని అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు