Homeఆంధ్రప్రదేశ్ఏపీ ప్రభుత్వం నూతన సంవత్సరంలో కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం నూతన సంవత్సరంలో కీలక నిర్ణయం

- Advertisement -

5 రకాల భూములు 22ఏ జాబితా నుంచి తొలగింపు
నూతన సంవత్సరం వేళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 5 రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించడానికి నిర్ణయం తీసుకుంది. దీనిని అమలు చేయడానికి రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్‌ తొలి సంతకం చేశారు. మిగిలిన 4 రకాల భూముల విషయంలో త్వరలో జీవోఎం ద్వారా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రైవేట్ భూములను పూర్తిగా 22ఏ జాబితా నుంచి తొలగించామని ప్రకటించారు. ప్రైవేట్ పట్టా భూములపై ఎవరు దరఖాస్తు చేసినా, అధికారులు సుమోటోగా పరిగణించాలి అని స్పష్టం చేశారు.

రైతులు, భూ యాజమానుల హక్కులను రక్షించడమే ప్రథమ కర్తవ్యం
ఇక ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూముల పత్రాలు ఉన్న వాటిని కూడా నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలన్నారు. అదేవిధంగా, స్వాతంత్ర్య సమరయోధుల భూములను కూడా 22ఏ జాబితా నుంచి తీసివేయాలని ఆదేశించారు. రైతులు, భూ యాజమానుల హక్కులను రక్షించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మంత్రి అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు