విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ( ఏపీటీఎఫ్) రూపొందించిన డైరీ, మరియు క్యాలెండర్లను శుక్రవారం ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేశవ్ మాట్లాడుతూ ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఒకటవ తేదీనే జీతాలు జమచేస్తూ సమస్యల పరిష్కారాని కృషి చేస్తున్నామన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గౌని పాతిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, కోనంకి అశోక్ కుమార్, జిల్లా ఉపాద్యక్షుడు. గౌనిమోహన్ రెడ్డి, ఉపాద్యాయ పత్రిక సంపాదకులు, కె. నరేష్ కుమార్ హాజరై మంత్రికి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, పదవ తరగతికి సంబంధించి వందరోజులు కార్యక్రమాన్ని శెలవు రోజులు మినహించాలని, 12 వ పిఆర్సి తక్షణమే అమలు చేయాలని, ఉపాద్యాయుల ఆర్థిక బిల్లులు, పెండింగ్ లో ఉన్న ఆర్జిత శెలవుల బిల్లును మంజూరు చేయాలని మంత్రుని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ ఉరవకొండ గౌరవ అధ్యక్షులు ఆర్, లోకేష్, ఉరవకోండ మండల ప్రదాన కార్యదర్శి వై.భువనే శ్వర చౌదరి, విడపనకల్ మండల ప్రదాన కార్యదర్శి నజీర్ అహమ్మద్, వజ్రకరూరు మండల ప్రదాన కార్యదర్శి. సొంటెల ధనంజయ, జిల్లా ప్రత్యేక ఆహ్వానితులు బండారు నారాయ స్వామి, జిల్లా కౌన్సిలర్స్, బిసి .ఓ బన్న, చంద శ్రీనివాసులు, పంపాపతి, కృష్ణ, సాకే మునిస్వామి, నాగిరెడ్డి, నగేష్, సూరేష్, మిడతలు బాస్కర్, కిషోర్ మరియు సీనియర్ నాయకులు, తలారి తిమ్మప్ప, మహేశ్వరప్ప, కళ్యాణ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గోన్నారు.


