Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును ప్రజలు సద్వినియోగం చేసుకోండి..

ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును ప్రజలు సద్వినియోగం చేసుకోండి..

- Advertisement -

యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఈనెల 4వ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకట నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్వాతి క్లినిక్ లో ఉచిత కంటి శిబిరముల యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం అధ్యక్షుడు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, క్యాంపు చైర్మన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వందల సంఖ్యలో ఎంతోమందికి కంటి వెలుగును ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరమునకు దాతలుగా కీర్తిశేషులు గూండా నారాయణ స్వామి జ్ఞాపకార్థం భార్య గూండా నాగలక్ష్మి కుమారుడు గూండా నాగరాజు, కోడలు గుండా అరుణ వారి కుటుంబ సభ్యులు (సిద్ది రాజేష్ సిల్క్స్ ధర్మవరం) వ్యవహరిస్తున్నారని తెలిపారు. కంటి పరీక్షలు చేయించుకునేవారు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ తో పాటు ఫోన్ నెంబర్ తమ వెంట తప్పనిసరిగా తీసుకొని రావాలని తెలిపారు. ఈ శిబిరంలో ఉచిత వైద్య శికిత్సలు, ఉచిత ఆపరేషన్, ఉచిత వసతి, ఉచితంగా అద్దాలు కూడా పంపిణీ చేయబడును తెలిపారు. కంటి శుక్లములు ఉన్నవారికి ఉచితంగా లెన్స్ అమర్చబడునని తెలిపారు. కావున పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి వి సుబ్బారావు, వీఆర్వో రాధాకృష్ణ, పోలా ప్రభాకర్, చాంద్బాషా, నాగార్జున, సికిందర్, గర్రె రమేష్ బాబు, సత్రశాల మల్లికార్జున, బండి నాగేంద్ర, వై కే శ్రీనివాసులు, కౌన్సిలర్ కేత లోకేష్, ఓవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు