Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఏపీ మోడల్ స్కూల్ లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్..

ఏపీ మోడల్ స్కూల్ లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్..

- Advertisement -

ఎం ఈ ఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ చక్కగా నిర్వహించడం జరిగిందని ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఎం శ్రీ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం శ్రీ కార్యక్రమం కింద అనేక కార్యక్రమాలు చేపట్టిందని అందులో భాగంగా విద్యార్థులు తమ సృజనాత్మకతను వినూత్నమైన ప్రయోగాలు చేయాలని అది కూడా చిన్నప్పటినుంచి అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ , నారాయణస్వామి నాయక్, చైతన్య లక్ష్మి, ధనలక్ష్మి తదితర ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థులు చేసినటువంటి ఎగ్జిబిషన్ ని అందరూ తిలకించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిమ్మలకుంట లోని తోలుబొమ్మలాట కార్యక్రమం విద్యార్థులు చాలా ఆసక్తిగా తిలకించారని అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు