Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచిగిచెర్ల గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం..

చిగిచెర్ల గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం..

- Advertisement -

వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మానాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని చెవిచెర్ల గ్రామంలో పొలం పిలుస్తోంది అనే కార్యక్రమాన్ని వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మానాయక్, మండల వ్యవసాయ అధికారి ముస్తఫా నిర్వహించారు. రైతు నరేష్ రెడ్డి సాగు చేసిన వేరుశనగ పంట పొలాన్ని అధికారులు సందర్శించారు. అనంతరం పంటను గూర్చి మాట్లాడుతూ పంట పూత దశలో ఉన్నది కావున ఎకరాకు నాలుగు బస్తాలు చొప్పున జిప్సం వేసుకోవాల్సిందిగా సూచించడం జరిగిందన్నారు. గింజ నాణ్యత , నూనె శాతం వృద్ధికి తోడ్పడుతుంది అన్నారు.. మచ్చ తెగులు నివారణకు కార్బెండజం + మ్యాన్కోజెబ్ ( సాఫ్) లీటరూ నీటికి రెండు గ్రాములు చొప్పున కలుపుకొని పిచికారి చేయాలని రైతులకు సూచించారు. వేరుశనగ పంటలో అధిక దిగుబడి కోసం యాజమాన్య పద్ధతులు సూచించడం జరిగిందన్నారు. రైతు సేవ కేంద్రం నందు యూరియా అందుబాటులో ఉన్నదని పంట సాగు చేసిన రైతులు అవసరమైన మేర వినియోగించుకోవాల్సిందిగా వారు తెలిపారు. అధిక యూరియా వాడటం వల్ల జరిగే నష్టాలను రైతులకు వివరించామని తెలిపారు. రబి సీజన్ సంబంధించిన పంట నమోదు వేగవంతం చేయవలసిందిగా గ్రామ ఉద్యాన సహాయకురాలు శిరీష ఎం.పీ. ఈ.ఓ మీనా లను ఆదేశించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు 8 రాఘవరెడ్డి పార్థ రెడ్డి ,రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు