విశాలాంధ్ర -ధర్మవరం ; పట్టణంలోని ఆర్డిటి గ్రౌండ్లో అండర్ -12 బాలుర మండల స్థాయి టోర్నమెంట్ ఘనంగా జరిగింది.ఈ టోర్నమెంట్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో ఆర్డిటి ధర్మవరం, బత్తలపల్లి జట్ల మ్యాచ్ ని టిడిపి నాయకులు సంధా రాఘవ , కొత్తపేట ఆది , జింక పురుషోత్తం జింకల రాజన్న , రాఘవ మిత్రబృంధం, ఆర్డిటి రీజినల్ డైరెక్టర్ హనుమంతప్ప , బత్తలపల్లి ఏరియా ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసులు , ఆర్ డి టి ధర్మవరం ఏరియా ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసులు పిల్లల తల్లిదండ్రులు హాజరు కావడం జరిగింది. అనంతరం కోచ్ రాజశేఖర్ మాట్లాడుతూ క్రికెట్ మ్యాచ్ హోరాహోరీగా నిర్వహించగా,టాస్ గెలిచిన బత్తలపల్లి జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది అని, ధర్మవరం జట్టు 20 ఓవర్లలో 242/1 పరుగులు చేసింది అని తెలిపారు. గోవర్ధన్ 50 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ తో 101పరుగులు చేశాడు అని తెలిపారు. బద్రీనాథ్ 27 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేశాడన్నారు. వేద వ్యాస్ 38 బంతుల్లో 6 ఫోర్లతో 61 పరుగులు చేశారన్నారు. బత్తలపల్లి 20 ఓవర్లలో 81/5 పరుగులు చేసిందన్నారు. బ్యాటర్ తౌఫిక్ 51 బంతుల్లో 8 ఫోర్లతో 42 పరుగులు చేశాడని, ధర్మవరం మ్యాచ్‌లో 161 పరుగుల తేడాతో విజయం సాధించింది అని తెలిపారు. అనంతరం విజేతలకు సంద రాఘవ బహుమతులను, ట్రోఫీలను అందజేశారు. తదుపరి క్రికెట్ టోర్నమెంట్ తరఫున సంద రాఘవ ను కోచు రాజశేఖర్ తో పాటు క్రికెట్ క్రీడాకారులు ఘనంగా సన్మానించారు.
ఘనంగా ప్రారంభమైన శ్రీనివాసులు మెమోరియల్ అండర్ 12 బాలుర క్రికెట్ టోర్నమెంట్
- Advertisement -
RELATED ARTICLES


