నేతన్న నేస్తం నిధులు విడుదలకు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి
చేతివృత్తిదారుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి
విశాలాంధ్ర- ధర్మవరం; రాష్ట్రంలోని చేనేత కార్మికులకు నేతన్న నేస్తం ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి తెలిపారు. ఈ సందర్భంగా వారు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డిఓ మహేష్కు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా నేతన్న నేస్తం బకాయిలను వడ్డీతో సహా వెంటనే కార్మికుల ఖాతాలో జమ చేయాలని, స్థానిక కార్మికులకు 75 శాతముఉపాధి కల్పించేలా తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమల రాయితీలను రద్దుచేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా చేనేత రిజర్వేషన్ చట్టాలను పక్కాగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. చేతి వృత్తి దారులకు విశ్వకర్మ యోజన పథకం రుణాలు మంజూరు చేయాలని, కార్మికుల ఆత్మహత్యలను ఆపడానికి, వారి బతుకు తెరువును కాపాడడానికి వెంటనే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీనివాసులు, ఈశ్వరయ్య, చేన్న భుజంగం, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.


