విశాలాంధ్ర ధర్మవరం; అన్నదానం దైవ సేవతో సమానమని రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రస్టు ఆధ్వర్యంలో 120 మందికి ఏగ్ బిర్యానీ పొట్లాలను, వాటర్ ప్యాకెట్స్ లను పంపిణీ చేశారు. అనంతరం కన్నా వెంకటేష్ మాట్లాడుతూ మా ట్రస్టు ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టడం, అది కూడా దాతల సహాయ సహకారాలతో నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. నేటి దాతగా అనంతపురం కు చెందిన కీర్తిశేషులు కిష్టం అశ్వత్తయ్య వారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు కృష్ణం శ్రీనివాసులు వెంకటరత్నమ్మ వారి కుటుంబ సభ్యులు సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం దాతలు అందరికీ ట్రస్టు తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ త్రిపేంద్ర నాయక్ మాట్లాడుతూ ఈ ట్రస్టు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, సమాజ సేవకులు, కౌన్సిలర్ కేతా లోకేష్, జయప్రకాష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
అన్నదానం దైవ సేవతో సమానం. కన్నా వెంకటేష్
- Advertisement -
RELATED ARTICLES


