– టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ హెచ్చరిక
విశాలాంధ్ర ధర్మవరం;శాంతియుతంగా ఉన్న ధర్మవరంలో వైషమ్యాలు సృష్టించాలని చూస్తే ఊరుకోమని తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ఈ సందర్భంగా ధర్మవరం రూరల్ మండల పరిధిలోని పోతుకుంటలో ఉన్న చర్చిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. చర్చిపై దాడి సంఘటనను తెలుసుకుని ఆయన అక్కడికి వెళ్లారు. చర్చిని పరిశీలించి.. ఘటన ఎలా జరిగిందన్నది ఆరా తీశారు. అధైర్యపడవద్దని.. ఈ దాడి చేసిన వారిని కచ్చితంగా పోలీసులు పట్టుకుంటారన్నారు. చర్చిలో దెబ్బతిన్న వస్తువుల కొనుగోలుకు శ్రీరామ్ రూ.30వేల ఆర్థిక సాయం చేశారు. భవిష్యత్ లో కూడా ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం చూస్తుందని వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ గత 15ఏళ్లుగా ఇక్కడ చర్చి ఉందని, చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తుంటారన్నారు. ఎవరికీ ఇబ్బంది కల్గించని వాతావరణం ఉండేదన్నారు. కానీ కొందరు ఆకతాయిలు చర్చిపై దాడి చేసి సామగ్రిని ధ్వంసం చేయడం, నిప్పు పెట్టడం వంటివి హేయమైన చర్యలంటూ శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి చిల్లరి పనుల వలన ఇక్కడ ప్రజల మధ్య వైషమ్యాలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఒకరికొకరు స్నేహపూర్వక వాతావరణంలో ఉన్నవారు పెడార్తాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. అందుకే ఈ సంఘటనలో బాధ్యులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకునే విధంగా చూడాలని పోలీసులను కోరామన్నారు. డీఎస్పీ సహా మొత్తం సిబ్బంది దీనిపై విచారనా చేస్తున్నారన్నారు. ధర్మవరంలో ఇలాంటి చర్యలను సహించేది లేదని ప్రభుత్వం ఎవర్నీ ఉపేక్షించదని పరిటాల శ్రీరామ్ మరోసారి హెచ్చరించా
వైషమ్యాలు సృష్టించాలని చూస్తే ఊరుకోం
- Advertisement -
RELATED ARTICLES


