-హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి
విశాలాంధ్ర ధర్మవరం; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని సంజయ్ నగర్ లో గల ప్రభుత్వ బిఎస్సార్ మునిసిపల్ బాలికల ఉన్నత పాఠశాల ఇద్దరు విద్యార్థులు స్పెల్ బి ( పదమునకు అక్షరాలు పలుకుట- ఉచ్చారణ లో స్పష్టత)కాంపిటీషన్లో రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన కొత్తచెరువు బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్పెల్ బి కాంపిటీషన్లో పాఠశాలకు చెందిన ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు చెందిన సోనా శ్రీ, ప్రవంతి, చైతన్య లక్ష్మి నాగ భవ్య జిల్లా స్థాయిలో గెలుపొందారు అని తెలిపారు. తదుపరి ఈనెల 22వ తేదీన కడపలో జరిగిన ఈ కాంపిటీషన్లో నలుగురు పాల్గొనగా అందులో చైతన్య లక్ష్మి, నాగ భవ్య మాత్రమే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం, బోధ నేతర బృందం, తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ, తోటి విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. మా పాఠశాలలో చదువు పట్ల మా ఉపాధ్యాయ బృందం ప్రత్యేక శ్రద్ధను ఘనపరచడం గర్వించదగ్గ విషయమని తెలిపారు.
స్పెల్ బి పోటీలో రాష్ట్రస్థాయికి ఎంపికైన బిఎస్ఆర్ బాలికల పాఠశాల విద్యార్థులు
- Advertisement -
RELATED ARTICLES


