Wednesday, February 18, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరిషి విద్యాలయాకి అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక ఐఎస్ఓ సర్టిఫికేషన్

రిషి విద్యాలయాకి అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక ఐఎస్ఓ సర్టిఫికేషన్

- Advertisement -

-పాఠశాల డీన్ భాస్కర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని రిషి విద్యాలయం పాఠశాలకు నాణ్యతా ప్రమాణాల పరంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 9001:2015(క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టం) ధృవీకరణ పత్రం లభించింది. కె.వి క్యూఏ సర్టిఫికేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్వహించిన సమగ్ర తనిఖీల అనంతరం, కిండర్ గార్డెన్ నుంచి 7వ తరగతి వరకు అందిస్తున్న విద్యా సేవలు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు గుర్తించి ఈ ధృవీకరణను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల
డీన్ భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ, “విద్యార్థులకు నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, విలువల ఆధారిత బోధన అందించడమే మా ప్రధాన లక్ష్యం అన్నారు. సి ఏ ఓ రవీంద్ర ఐ ఎస్ ఓ సర్టిఫికేషన్ మా బృందం కృషికి నిదర్శనం” అని తెలిపారు.
ప్రిన్సిపల్ కరణ్ స్వరూప సింగ్ మాట్లాడుతూ ఈ విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులందరికీ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. ఏ ఓ.రంగా రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత ప్రమాణాలతో విద్యా సేవలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపల్ కళ్యాణి , రిషి బృందం హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు