Wednesday, February 18, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅండర్-12 బాలుర జట్టుకు ఆర్డీటీ ధర్మవరం క్రీడా కేంద్రం క్రీడాకారులు ఎంపిక

అండర్-12 బాలుర జట్టుకు ఆర్డీటీ ధర్మవరం క్రీడా కేంద్రం క్రీడాకారులు ఎంపిక

- Advertisement -

మండల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు వడ్డే బాలాజీ ,కార్యదర్శి శివశంకర్

విశాలాంధ్ర ధర్మవరం; అండర్ – 12 బాలుర ధర్మవరం మండల జట్టుకు ఆర్డిటి ధర్మవరం క్రీడా కేంద్రం నుంచి పదిమంది క్రీడాకారులు ఎంపిక కావడం జరిగిందని ధర్మవరం మండల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు వడ్డె బాలాజీ , కార్యదర్శి శివశంకర్ తెలిపారు. అనంతరం వారు ఆటగాళ్ల ఎంపిక గురించి మాట్లాడుతూ మంచి పట్టుదలతో ఎంపిక కావడం జరిగిందన్నారు. ధర్మవరం నుండి గరిష్ట సంఖ్యలో ఆటగాళ్ళు ఉన్నత స్థాయికి ప్రాతినిధ్యం వహించాలని, ఆర్ డి టి , తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఆర్డీటీ క్రీడలు , అట్టడుగు స్థాయి పిల్లల అభివృద్ధికి చాలా కృషి చేస్తుందని కూడా అన్నారు. ఎంపిక కాబడిన క్రీడాకారులలో బి బద్రీనాథ్, పి వేద వ్యాసు, జె గోవర్ధన్,ఎం మణికంఠ,ఎన్ సిద్ధార్థ్,ఎం రాజా,పి లోహితాక్ష , సి ప్రజ్వల్,పి. విక్రమాదిత్య,జి అంజినేయలు గలరని తెలిపారు. తదుపరి వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు