Homeజిల్లాలుఅల్లూరి సీతారామ రాజుదేశ చరిత్రనే మార్చగలిగేది ఓటు..

దేశ చరిత్రనే మార్చగలిగేది ఓటు..

- Advertisement -

ఎంపీడీవో ప్రేమ్ సాగర్…

విశాలాంధ్ర- డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా): దేశ చరిత్రనే మార్చగలిగేది ఏకై ఒక్క ఆయుధం ఓటు మాత్రమేనని మండల అభివృద్ధి శాఖ అధికారి ప్రేమ్ సాగర్ అన్నారు. ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శనివారంమండల కేంద్రంలోని తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయం నుంచి చేపట్టిన ర్యాలీ అరకు పాడేరు ప్రధాన కూడలి వద్ద ఆగి మానవహారం నిర్వహించి ఓటు ఒక ప్రాముఖ్యతను వివరించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఓటు ఎంతో పవిత్రమైనదని అటువంటి ఓటును ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తతో వినియోగించుకోవాలని చెప్పారు. అర్హులైన నేటి యువత ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొంది ప్రజాస్వామ్య విలువలను పెంపొందించుకోవాలని చెప్పారు. పవిత్రమైన ఓటును పవిత్రంగానే వినియోగించుకోవాలని చెప్పారు. దేనికి ఆశించకుండా దేశ భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పవిత్రమైన ఓటును పవిత్రంగా వినియోగించుకోవాలని చెప్పారు. అనంతరం ఓటు హక్కు దరఖాస్తు విధానం, నిబంధనలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ సుబ్బారావు, స్థానిక సర్పంచ్ వెంకట్రావు, టిఎన్టియుసి అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి స్వామి, పంచాయితీ సిబ్బంది, ఆయసక అధికారులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు