లక్షలలో తరలిరానున్న కమ్మ సోదరులు..
విశాలాంధ్ర అనంతపురం టౌన్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సోదరులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు 2023 వ సంవత్సరంలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ( కే జి ఎఫ్ ) ను జెట్టి కుసుమ కుమార్ వ్యవస్థాపక అధ్యక్షులుగా స్థాపించారు. అప్పుడు హైదరాబాద్ వేదికగా జరిగిన మహాసభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం ఫిబ్రవరి 8వ తేదీన తమిళనాడు తిరువల్లూరు జిల్లా వేమపట్టు గ్రామంలో చారిత్రాత్మకంగా కమ్మ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో 65 లక్షల మంది కమ్మవారు ఉండగా.. వారందరిని ఒక్కతాటిపైకి తీసుకురావడం.. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని కమ్మ ప్రముఖులు అందరిని ఈ కమ్మ మహానాడుకు కే జి ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు జెట్టి కుసుమకుమార్ ఆహ్వానిస్తున్నారు. రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలలో నిష్ణాతులైన కమ్మవారు ఈ బృహత్తర కమ్మ మహానాడు సభకు తరలిరానున్నారు. ఇందుకుగాను కే జి ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు కుసుమ కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటి కమ్మ భారీ బహిరంగ సభ నిర్వహణ బాధ్యత అనంతవాసి యశ్వంత్ హ్యాపీ ఈవెంట్స్ కు కే జి ఎఫ్ వ్యవస్థాపకులు కుసుమకుమార్ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా యశ్వంత్ మాట్లాడుతూ.. ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమ నిర్వహణ బాధ్యత తనకు అప్పగించినందుకు జెట్టి కుసుమ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. కమ్మ మహానాడు సభ కార్యక్రమ నిర్వహణను హ్యాపీ ఈవెంట్స్ టీం ఒక ఛాలెంజ్ గా తీసుకుందని, ఇప్పటికే తమిళనాడులో టీవీకే పార్టీ విజయ దళపతి నిర్వహించిన సభను పది లక్షల మందితో విజయవంతం చేశామని, అంతకుమించి ఈ సభను జయప్రదం చేస్తామని యశ్వంత్ తెలిపారు.
ఫిబ్రవరి 8న కేజిఎఫ్ చారిత్రాత్మక సభ
- Advertisement -


