Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా యశోద కాన్సెప్ట్ స్కూల్ 18 వ వార్షికోత్సవం

ఘనంగా యశోద కాన్సెప్ట్ స్కూల్ 18 వ వార్షికోత్సవం

- Advertisement -

కరెస్పాండెంట్ మల్లికార్జున.

విశాలాంధ్ర ధర్మవరం: పట్టణములోని యశోద కాన్సెప్ట్ స్కూల్లో 18 వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నట్లు డైరెక్టర్ రవీంద్ర, కరెస్పాండెంట్ మల్లికార్జున తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ శ్రీ వీణవడ్డీ రెడ్డి, ఎంఈఓ లు రాజేశ్వరి దేవి గోపాల్ నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణంలో యశోద కాన్సెప్ట్ స్కూలుకు మంచి గుర్తింపు, మంచి విద్యతోనే రావడం జరిగిందని తెలుపుతూ యాజమాన్యాన్ని వారు అభినందించారు. చైర్మన్ శంకర్ నారాయణ మాట్లాడుతూ పాఠశాలలో ప్రతిభ గర్జనపరిచిన వారిని విజయపతంలో నడిపించే ప్రోత్సాహకరమైన సాంప్రదాయం చాలా బాగున్నదని వారు కొనియాడారు. కర్రీస్పాండెంట్ మల్లికార్జున, రవీంద్ర మాట్లాడుతూ ప్రారంభం నుండి తల్లిదండ్రులు బాగా ప్రోత్సహిస్తున్నారని, ఫలితంగానే పాఠశాల అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు.తదుపరి గత సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో పది గ్రేడ్లు పాయింట్లు సాధించిన విద్యార్థులకు పాఠశాల చైర్మన్ శంకర్ నారాయణ, డైరెక్టర్లు రవీంద్ర కరెస్పాండెంట్ మల్లికార్జున పృథ్వీరాజ్ చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన భరత కూచిపూడి, ఇలాంటి శాస్త్రీయ నాట్యాలు, సందేశాత్మకమైనదే దేశ భక్తిని మానవీయ నైతిక విలువలను ప్రబోధించే నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనూప్, డైరెక్టర్ పృథ్విరాజ్, కుటుంబ సభ్యులు, పట్టణ ప్రముఖులు, పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు