Homeఅంతర్జాతీయంచర్చలకు రాకుంటే నాశనం

చర్చలకు రాకుంటే నాశనం

- Advertisement -

ఇరాన్‌కు ట్రంప్‌ తీవ్ర హెచ్చరిక

ఇరాన్‌ చర్చలకు రాకపోతే గతంలో కంటే భీకరస్థాయిలో దాడులు చేస్తాం.. నాశనం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం హెచ్చరించారు. అణు ఒప్పందంపై చర్చలకు రాని పక్షంలో ఇరాన్‌పై భీకర స్థాయిలో విరుచుకుపడతామని అన్నారు. ‘అణు ఒప్పందం కోసం ఇరాన్‌ త్వరగా చర్చలకు వస్తుందని భావిస్తున్నాను. అణ్వాయుధాలను నిషేధించే ఒప్పందం అందరికీ మేలు చేస్తుంది. భారీగా యుద్ద నౌకలు ఇరాన్‌వైపు గొప్ప శక్తితో, ఉత్సాహంతో, వేగంతో, ఓ లక్ష్యంతో వెళుతున్నాయి. సమయం లేదు. ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్‌కు మరోసారి చెబుతున్నా్ణ్ణ అని ‘ట్రూత్‌ సోషల్‌్ణలో ట్రంప్‌ పేర్కొన్నారు.. మరోవైపు అమెరికా దాడికి సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తుండటంతో పశ్చిమాసియా దేశాల మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్‌ నిమగ్నమైంది. ఇరాన్‌పై దాడికి అమెరికా తమ ఆకాశ మార్గాన్ని వినియోగించడానికి అనుమతించబోమని సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లు భరోసా ఇచ్చాయని తెలిసింది. ట్రంప్‌ హెచ్చరికపై ఇరాన్‌ ఘాటుగా స్పందించింది. తమను యుద్ధం దిశగా నెడితే.. గతంలో ఎన్నడూ చేయని స్థాయిలో దాడి చేస్తామంది. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు