Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగ్రూప్-2 లో కొలువు సాధించిన షేక్ దాదా పీర్

గ్రూప్-2 లో కొలువు సాధించిన షేక్ దాదా పీర్

- Advertisement -

అభినందించిన మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా
విశాలాంధ్ర ధర్మవరం: పురపాలక సంఘ 12వ వార్డులో మార్కెట్ వీధి నందు వార్డు పరిపాలన కార్యదర్శిగా విధులు కొనసాగిస్తున్న షేక్ దాదా పీర్ గ్రూప్ టు ఫలితాలలో నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాటగిరి నందు డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపిక కావడం జరిగింది. ఇతని విజయం పట్ల మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, రాష్ట్ర స్వర్ణ గ్రామం, వాడు ఉద్యోగుల అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా, తోటి ఉద్యోగులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ సమయాన్ని సక్రమంగా వినియోగించుకొని కఠినమైన పోటీ పరీక్షల్లో విజయం సాధించడం అభినందనీయతగా విషయమన్నారు. కష్టపడితే ఎంతటి కష్టాన్ని అయిన సాధించవచ్చునని షేక్ దాదా పీర్ నిరూపించడం జరిగిందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు