Homeజిల్లాలుశ్రీ సత్యసాయికార్మిక హక్కులు హరిస్తున్న లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి

కార్మిక హక్కులు హరిస్తున్న లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి

- Advertisement -

ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిమాండ్
విశాలాంధ్ర ధర్మవరం: కార్మిక హక్కులను హరిస్తున్న లేబర్ కోర్స్ ను వెంటనే రద్దు చేయాలని, 12వ పిఆర్సి, జీతాల పెంపు డిమాండ్ సాధనకై ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సమ్మె నోటీసును పట్టణంలోని పురపాలక సంఘ కమిషనర్ వెంకట రమణయ్యకు అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షుడు అయుబుఖాన్, మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బాబ్జాలు మాట్లాడుతూ రెండు సంవత్సరాలు గడిచినా కూడా నేటికీ జీతాలు పెంచలేదని 12వ పిఆర్సి ని ప్రకటించడం లేదని వారు మండిపడ్డారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకే దేశవ్యాప్త సమ్మను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాబు, ముకుంద, కోశాధికారి లక్ష్మీ ఓబులేష్, ఇంజనీరింగ్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అనిల్, యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు చౌడమ్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. కరోనా, అడిషనల్ కార్మికుల వేతనాలు వెంటనే పెంచాలి.. కరోనా, అడిషనల్ కార్మికుల వేతనాలు 12,000 నుంచి 17,500 వరకు పెంచాలని, మృతి చెందిన ఆప్కాస్ కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు అయూబ్ ఖాన్ మాట్లాడుతూ 2020లో కరోనా సమయంలో 40 మంది దినవారి కార్మికులని, ఆ తర్వాత 47 మందిని అదనపు కార్మికులని రోజుకు 400 రూపాయల వేతనంతో మొత్తం 87 మంది కార్మికులు పనిలోకి తీసుకోవడం జరిగిందన్నారు. కానీ వారికి న్యాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మీ సమస్యలను త్వరలోనే పరిష్కారం అయ్యే విధంగా చూస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పారిశుధ్య కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు మేకల బాబు, ముకుంద, సిఐటియు నాయకులు రఫీ సేక్షావలి తోపాటు దినవారి కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు