శ్రీ సత్య సాయి జిల్లా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజా
విశాలాంధ్ర ధర్మవరం;; విజయవాడలో అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో నిరుద్యోగి రణభేరి కార్యక్రమం విజయదుంది మోగించింది. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజా తో పాటు పదుల సంఖ్యలో విజయవాడలో పాల్గొన్నారు. అక్కడ జరిగిన నిరసన కార్యక్రమానికి, ర్యాలీకి పాల్గొని, పోరాటాలు కొనసాగించారు. నిరసన కార్యక్రమంలో పోలీసులను కూడా లెక్కచేయకుండా పోరాటమే తన ఊపిరిగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తన వంతు పాత్ర సకల రాజా తోపాటు జిల్లా నాయకులు వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఎన్డీఏ ప్రభుత్వం నిరుద్యోగ భృతి 3 వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి సంవత్సరాలు గడిచిన ఇవ్వలేకపోవడం సిగ్గుచేటు కాదా అని వారు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులు తమ చదువును పెంపొందించేందుకు ఆ నిరుద్యోగ భృతి ఉపయోగపడుతుందన్న ఆశతో ఓట్లు కూడా వేయడం జరిగిందన్నారు. కానీ ఎన్నికల హామీ నిరుత్సాహంగా నిరుద్యోగులలో మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులు కూడా భర్తీ ఎందుకు చేయలేకపోతున్నారో అర్థం కాలేదని వారు మండిపడ్డారు. ఇప్పుడు వివిధ ప్రభుత్వ ఉద్యోగ కార్యాలయాలలో ఉన్న ఉద్యోగులకే అదనపు పనులు కేటాయించడంతో, అక్కడి ఉద్యోగులు కూడా ఏమి చేయాలో తోచక, సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలిపారు. మెగా డీఎస్సీ ని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి జిల్లా ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
విజయ దుందుభి మోగించిన నిరుద్యోగి రణభేరి..
- Advertisement -
RELATED ARTICLES


